రాజ్యాంగ రక్షణ మనందరి బాధ్యత
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 : కేంద్రంలో మరోసారి బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మార్చేస్తుందని,అందుకే రాజ్యాంగ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, రాజ్యాంగ రక్షణకై ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పేర్కొన్నారు.శుక్రవారం రాజ్యాంగ రక్షణ యాత్ర మండలం కేంద్రంకు చేరుకొగా జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు గరిసే రవీందర్,ప్రధాన కార్యదర్శి బైరం లింగన్నతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగాన్ని మార్చి రాజరిక వ్యవస్థ తీసుకొస్తారన్నారు. రానున్న రోజుల్లో ఓటు అనే ఆయుధంతో బీజేపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తెలిపారు.బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలు ఐక్యంగా ఉండి రాజ్యాంగ రక్షణకై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక దళ్ రాష్ట్ర అధ్యక్షులు ఆసాది పురుషోత్తం,పట్టణ అధ్యక్షుడు పెండం రాజ్, జై భీమ్ సైనిక్ దళ్ మండల అధ్యక్షుడు నలుగునూర్ నరేష్, ఆనోకు,జంగిలి శీను, గుత్తికొండ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.