కాంగ్రెస్ పార్టీని బద్నామ్ చేస్తే ఊరుకోము

 

గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏమీ చేయలేదు

ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 31 : తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ సర్కార్ ను బద్నామ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని,గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఏమీ చేయలేదని ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు.శుక్రవారం పట్టణంలోని గురునానక్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…బీఆర్ఎస్ పార్టీ నాయకుల మతిస్థిమితం లేని మాటలను ఖండిస్తున్నామన్నారు. అసంబద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిగ్గుమాలిన చర్యలకు పూను కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలనలో ఉండీ పేద ప్రజలకు కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు.డబుల్ బెడ్ రూం,దళితులకు మూడెకరాలు భూమి ఎక్కడ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.దళితున్ని సీఎం చేస్తానని మాట తప్పింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. చేప్తూపోతే బీఆర్ఎస్ పార్టీ హామీల పార్టీ తప్ప హామీలు అమలు చేసే పార్టీ కాదని గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి అధికారాన్ని ఇచ్చారన్నారు.ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే వినియోగిస్తూ,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలతో పాటు గత ప్రభుత్వం చేయలేని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు.మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు కలగా మారిన మాతాశిశు ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి,లక్షెట్టిపేట గవర్నమెంట్ స్కూల్,దండేపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటివి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ,ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుండి చేయలేని కార్యక్రమాలు ఒకే సంవత్సరం లోనే చేశామని,ఇంకా చేస్తామని,ప్రజలెవరూ కూడా బీఆర్ఎస్ నాయకుల 420 మాటలు నమ్మకూడదన్నారు.వారికి తగిన బుద్ది చెబుతూనే ఉంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమేల రాజు,తోట రవి,సూరం చంద్రమౌళి, మడిపెల్లి స్వామి,అమీర్,హాజీ, సయ్యద్ షాహిద్ అలీ,రాజు,గోపతి రమేష్,ఉత్తూరి రవీందర్,ప్రశాంత్, వార్డ్ అధ్యక్షుడు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking