రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 31 జనవరి 2025
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్భంగా మణికొండలోని బీరప్ప మందిరంలో మరియు లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో కుంకుమార్చన, హోమం ఘనంగా జరుప బడిందనీ, ఇట్టి విశిష్ట కార్యక్రమానికి 200 మందికి పైగా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొని వాసవి మాత పారాయణం చేయడం కార్యక్రమంలో వాసవి క్లబ్ కపుల్స్ మణికొండ అధ్యక్షులు వంగవీటి వంశీకృష్ణ, కార్యదర్శి జగదీశ్వర్, కోశాధికారి గుంటూరు శిరీష, క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ వాడకట్టు ఈశ్వర్ ప్రసాద్, డిస్టిక్ ఇంచార్జ్ కలగర్ల నిరీష, డిస్టిక్ ప్రోగ్రాం ఆఫీసర్ నాగరాజు కాచం, ప్రాజెక్ట్ చైర్మన్ కిరణ్ కుమార్, డిస్టిక్ కోశాధికారి గంగిశెట్టి నవీన్ కుమార్, ఈ.సీ సభ్యులు, ఆర్య వైశ్య అధికారులు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పుప్పాలగూడ అధ్యక్షుడు వేణుమాధవ్, స్రవంతి, శ్రీధర్ బొడ్డు, క్లబ్ సభ్యులందరు పాల్గొని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపకు పాత్రులై విశిష్ట పూజలను విజయవంతం చేశారు.
