తూప్రాన్ లో గద్దర్ 77వ జయంతి వేడుకలు.

 

గజ్వేల్ నియోజకవర్గం జనవరి, 31. ప్రాజబలం ప్రతినిధి.

మెదక్ జిల్లా తూప్రాన్ ముద్దు బిడ్డ ప్రపంచ ఖ్యాతి పొంది అమరుడైన మహానేత గుమ్మడి విఠల్ రావు (గద్దర్) 77వ జయంతి వేడుకలు జనవరి 31 శుక్రవారం ఉదయం తూప్రాన్ బస్టాండ్ లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. గద్దర్ అమర్ హై అంటూ నినదిస్తూ ఆయన సేవలను గుర్తు చేశారు. గద్దర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మన్నె శ్రీనివాస్ రావు,చిన్నలింగ్ మల్లికార్జున్ గౌడ్,స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు సాయి సమ్మర్, సామల అశోక్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు
పర్శ నర్సింగ్ రావు, ఏర్పుల రాము, బల్ రాజు, ప్రవీణ్ కుమార్, చిట్టిమిల్ల అనిల్ కుమార్, సత్తయ్య, రాములు,
జీడిపల్లి బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking