రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 31 జనవరి 2025
మణికొండ పరిధి లోని అలకాపురి రోడ్డు నంబర్ 4లో గల మునిసిపల్ స్పోర్ట్స్ పార్క్ లో జలమండలి 2.5 ఏం.ఎల్.డి, కృష్ణారెడ్డి కాలనీ లోని రిజర్వాయర్ లు పూర్తి అయినను వాడుక లోకి రానందు వలన స్థానిక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు, రానున్న వేసవి కాలంలో ఇంకా చాలా చాలా ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఉన్నది మరియు నెమలి నగర్ లో రిజర్వాయర్ కట్టడానికి స్థల సేకరణ జరిగినను అధికారుల అశ్రద్ద వలన కట్టడం మొదలు కాలేదని, సదరు అధికారులు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని స్పందించి వెంటనే రిజర్వాయర్ నుంచి మంచి నీటి సరఫరా చేసి ప్రజలకు మేలు చేయాలని, ఈ విషయంలో గతంలో జలమండలి ఖైరతాబాద్ అధికారులను కలసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగినదని, సదరు అధికారులు ఇట్లాగే సమస్యను సాగదేస్తే ప్రజల మద్దతుతో ధర్నా కార్యక్రమం చేపట్టగలమని బీ.ఆర్.ఎస్ పార్టీ తరఫున అందరు కలసి కట్టుగా డిమాండ్ చేయడం జరిగినదనీ మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, ప్రధాన కార్యదర్శి గుట్టమిధి నరేందర్ లు తెలిపినారు.
Prev Post
Next Post