రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 31 జనవరి 2025
మణికొండ మునిసిపాలిటీలో పరిధిలో నివసించే ప్రజలు పలు సమస్యలతో బాధపడచున్నారని, ముఖ్యముగా ట్రాఫిక్ సమస్య, మరమ్మత్తులు లేని రహదారులు, త్రాగునీటి సమస్య తీవ్రత, మురుగు నీరు పారుదల విషయాలు కాగా పుప్పలగూడ గ్రామ పరిధిలో అంబేద్కర్ భవనం నిర్మించడానికి గతంలో 49 లక్షలు మంజూరు కాగా, ఆ నిధులు ఎటుమల్లినవో తెలుపకుండా ధాటవేయడం మునిసిపల్ అధికారులకే చెల్లుబాటు కాగా, తాత ముత్తాతల నుండి స్మశాన వాటికకు వెళ్ళడానికి దారి ఉండగా అట్టి దారినీ మూసివేయడం జరిగినదని ప్రజలు గగ్గోలు పెడుతున్నాను పట్టించుకొకపోవడం అధికారుల నిర్లక్ష్య ధోరణికి ప్రత్యక్ష సాక్ష్యం కాగా ఈ విషయాలపై బీ.ఆర్.ఎస్ పార్టీ తరపున పలు దఫాలుగా అధికారులను కలసి వినతి పత్రాలు అందజేయడం జరిగినదని మణికొండ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, ముఖ్య నాయకుల బృందం సి.డి.ఏం.ఏ కార్యాలయంలో గల మణికొండ మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ ను మర్యాపూర్వకంగా కలసి అన్ని విషయాలు వివరంగా చెప్పడం జరిగినది.
