హైదరాబాద్ జూన్ 12;పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50% రిజర్వేషన్లు పెట్టాలని మరియు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలా లేని పక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేసి దేశ వ్యాప్తంగా ధర్నాలు – నిరసనలు చేస్తామని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆదివారం గద్వాలకు చెందిన బి.సి నాయకులు బి.సి భావంలో కలిసి చర్చలు జరిపారు. కర్నాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఒరిస్సా తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించింది. బీసీలు పార్టీలకతీతంగా బలమైన బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని కోరారు. త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తామని అన్నారు. ఈ చర్చలలో జోగులాంబ గద్వాల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అద్యక్షులు తట్టే మహేశ్, తుమ్మకుంట కె.కె, పెదొడ్డి రాజు, మహానంది తదితరులుపాల్గొన్నారు.కర్నాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఒరిసా తదితర రాష్ట్రాలలో పర్యటించి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కమిటీ నిర్ణయించారు. బీసీలు పార్టీలకతీతంగా బలమైన బీసీ ఉధ్యమాన్ని నిర్మించాలని కోరారు. త్వరలోనే దేశవ్యాప్త పర్యటన చేస్తామని అన్నారు. ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ దేశంలో గత 75 సంవత్సరాల గా పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాట్ ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా అన్యాయం జరుగుతుందన్నారు.