నేడు జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

 

జిల్లాలోని నియోజకవర్గాల్లో పాల్గొననున్న మంత్రి మల్లారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల శాసనసభ్యులు,

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 12: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రతినిత్యం అంగరంగ వైభవంగా ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ప్రభుత్వం సూచించిన మేరకు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఈనెల 13న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించే వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు చేయాలని కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గం కేంద్రాల్లో మహిళా సదస్సు నిర్వహించాలన్నారు. ఈ సదస్సులో ఆంగన్వాడీ టీచర్లు, సెర్ఫ్ సిబ్బంది, తదితరులు మొత్తం పాల్గొనేలా చూడాలని కలెక్టర్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలని ఒంటరి మహిళలకు పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీసు శాఖలో 33 శాతం రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు వీ–ఎల్గర్, షీ– టీమ్స్, వీ– హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర వివరాలన్నింటినీ అందరికీ అర్థమయ్యేలా వివరిరంగా ఘనంగా పేర్కొనాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు. ఈ విషయంలో ఆయా అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు ఇతర మహిళా ఉద్యోగులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలన్నారు. దీంతో పాటు మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేస్తూనే అందుకు సంబంధించి మహిళలతో ఎక్కువగా మాట్లాడించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయా రంగాల్లో ప్రతిభ చూపిన ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలని ఈ సమావేశంలో మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులందరూ పాల్గొనేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ ఆదేశించారు. అలాగే ఈనెల 13న జరిగే తెలంగాణ మహిళా దినోత్సవ సంబరాల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని సాయినగర్లో శికారారి మల్లయ్య ఫంక్షన్హాల్లో నిర్వహించనుండగా కుత్భుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వేడుకలను గాజులరామారంలో ఉన్న మహారాజా గార్డెన్స్లో జరుగుతుందని ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రామంతాపూర్లోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో కార్యక్రమాలను నిర్వహించనుండగా కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వేడుకలను కూకట్పల్లి వై జంక్షన్లో ఉన్న ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్ల అత్యంత అద్భుతంగా జరగాలని అందుకు ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాల్సిందిగా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking