చండీ హోమం యెక్క ప్రాముఖ్యత

మణికొండ పురపాలక సంఘం పరిధిలోని పుప్పాలగుడలో గల శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వనాథ సమేత నల్లపోచమ్మ మందిరంలో 24-2-2023 రోజున మొదలైన అఖండ దీపారాధన, శ్రీ సూక్త పారాయణము మరియు ఉదయం 7 గంటలకు వచ్చిన భక్తులందరికి స్సహస్ర పుష్పార్చనలో భాగంగా గర్భాలయంలో ప్రవేశం కల్పించి అమ్మ వారికి పుష్పాలను సమర్పించే గొప్ప అవకాశాన్ని అందించిన్నారు 108 వ రోజైన 11-6-2023 ఆదివారం రోజున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చండీ హోమం జరిపినారు, మార్కాండేయ పురాణం ప్రకారం చండీమాత-దుర్గాదేవి ఓ ప్రచండ శక్తి అని, సృష్టి జరగడానికి, వృద్ది చెందడానికి, లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమె లోనే ఉందని అట్టి ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి, కుండలినీ శక్తి మహత్యాలను, విజయాలను వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలందరూ ఆమె వైభవాన్ని కీర్తించే శక్తి వంతమైన మంత్రాల కదంబమే చండీ/దుర్గా సప్త శతి అని అర్చకులు శాంత కుమార్ శర్మ చెప్పడం అతిశయోక్తి కాదేమో అని అనిపిస్తుంది. అంత ప్రాధాన్యం గల లోకరక్షకు రాలైన అమ్మవారి స్వరూపాల్లో చండీమాత-దుర్గాదేవి ఒకటి. లోక కల్యాణార్థం, విశేష కార్య సిద్దిల కోసం సకల చరా చర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూలకారణమైన జగన్మాతను ఆరాదించడం అనాదిగా వస్తున్నదని చండీ హోమానికి సంబందించి నవచండీ యాగం, శతచండీ యాగం, సహస్రచండీ యాగం, ఆయుత (పదివేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగాలు ఉంటాయిని, అట్టి చండీ హోమం జరిగిన శుభ కార్యక్రమానికి విచ్చేసి అమ్మ వారి కరుణా కటాక్షం పొంది, సర్వ శుభాలు కలుగునట్లు ఆ జగన్మాత ఆశీర్వాదం పొందిన వారిలో వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ అద్యక్షుడు బత్తిని బాపూజీ, కోశాధికారి దిలీప్ కక్కడ్, సభ్యుడు అందె లక్ష్మణ్ రావు మరియు భక్తులతో కూడిన పుర ప్రముఖులు, పుర జనులు అధిక సంఖ్యలో పాల్గొని మందిర ట్రస్ట్ తరఫున సేవ గావించిన అమ్మ వారి భోజన ప్రసాదములు స్వీకరించినారని మందిర సభ్యులు రాజ్ కుమార్, కుమార్ గౌడ్, పద్మా రావు, గుట్టమీది నరేందర్, కృష్ణ స్వామి, మోహన్ సింగ్, మల్లేష్, శ్రీశైలం, బహదూర్ సింగ్ లు తెలియ జేసినారు. ఓం శ్రీ మాత్రే నమః

Leave A Reply

Your email address will not be published.

Breaking