మెదక్ తూప్రాన్ ప్రజా బలం 14 సెప్టెంబర్ ప్రజా బలం న్యూస్ :-
ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గం గజ్వేల్ లోని తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో లెక్కకు మించిన అవినీతి పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపులో స్థానిక నాయకుల ఇస్టారాజ్యం , నచ్చిన వారికి కేటాయింపు, తెలంగాణ రాష్ట్రంలోని మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మంత్రి హరీష్ రావుకు మాయని మచ్చ తెచ్చిన స్థానిక నాయకులు. దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు 10 సంవత్సరాలలో కేవలం ఒక్కసారి మాత్రమే తూప్రాన్ కు వచ్చారని ప్రజలు చెబుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య శాఖ మంత్రి అయిన తన్నీరు హరీష్ రావు గారు జిల్లా ఇన్చార్జిగా, నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నా యథేచ్ఛగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యంగా పాలకులు, కౌన్సిలర్లు రియల్ మాఫియాతో కుమ్ముక్కై పేద ప్రజలకు, భూ యజమానులకు విపరీతమైన ఆందోళనను సృష్టిస్తున్నారు. ఎవరికి చెప్పుకుందామో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలంతా ఉండగా అక్రమార్కుల విచ్చలవిడితనం పెరిగిపోతున్నది. తూప్రాన్ మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డగా మారిపోయింది.
పేదల పెన్నిధి అపర భగీరథుడు మంత్రి హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ పై
ప్రత్యేక ద్రుష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
కెసిఆర్ గారి నియోజకవర్గంలోనే ఇంత దారుణపైన పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల పరిస్థితి ఎంత దారుణమో అని స్ధానిక ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకోకపోతే నియోజకవర్గంలో పరిస్థితి దారుణంగా తయారు కాబోతుందని భావిస్తున్నారు. గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు చొరవతో తూప్రాన్ మున్సిపాలిటీ లో అభివృద్ధి .
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు బాగా లబ్ధి పొందినట్టుగా ప్రజలు ఏకకంఠంతో చెబుతున్నారు. ఇప్పటికైనా పరిస్థితి మారుతుందో లేదో వేచి చూడాలి.