పుండు ఒకటే అయితే మందు ఒకటి

ప్రజా బలం ప్రతి నిధి ములుగు జిల్లా సెప్టెంబర్ 10 :

తల్లిని కబలించిన విష జ్వరం అనాధలైన పిల్లలు అనే శీర్షిక అనుసరించి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాలతో DMHO గారు వైద్య బృందాన్ని చనిపోయిన లావణ్య గ్రామమైన అబ్బాపురం ములుగు మండలమునకు వెళ్లి విచారించడం జరిగింది. వైద్య బృందం విచారణ మేరకు లావణ్య గత రెండు రోజులుగా చాతి నొప్పితో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆసుపత్రి ములుగు కు వచ్చి వైద్యం చేసుకున్నట్టు వారి కుటుంబ సభ్యుల ద్వారా వైద్య బృందం తెలుసుకోవడం జరిగింది ఆసుపత్రి వైద్యులు రాసిన పస్క్రిప్షన్ ప్రకారం కూడా చాతి నొప్పి రాసి ,ప్రాథమిక పరీక్షలైన ఈసీజీ ఎక్స్రే లాంటి పరీక్షలు చేయకుండా గ్లూకోజులు మరియు అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ మరియు పారాసెటమాల్ ఇంజక్షన్ రోగికి ఇవ్వడం జరిగింది అవి గ్రయించి డిఎంఎన్ హెచ్ ఓ ఆదేశాలతో ములుగులో రోగి వై చికిత్స చేసుకున్న క్లినిక్ ని కూడా తనిఖీ చేయగా అతనికి ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకపోగా ఎక్కువ మోతాదులో హైయర్ ఆంటీబయాటిక్ని ఇస్తున్నట్టు గ్రహించి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది లావణ్య అనే మరణానికి కారణం గుండెనొప్పి అని వైద్య బృందం భావిస్తుంది కానీ సదరు వైద్యుడు పుండు ఒకటే అయితే మందు ఒకటి అనే సామెతలు ప్రకారం వైద్యం అందించడం జరిగిందని తెలిపారు పేపర్లో ప్రచురించినట్టుగా విష జ్వరం కాదని అది గుండె నొప్పి కావచ్చని DMHO గారు తెలిపారు. దీని సందర్భంగా ఇటు ప్రజలకి అటు ఆర్ఎంపి లకు తెలియజేయునది జ్వరము లాంటివి లక్షణాలు పడితే వెంటనే మీ దగ్గర లో గల ఆశను గాని ఏఎన్ఎం గాని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకొని వారిచ్చే మాత్రలు వాడి దగ్గర ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని లేదా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని కానీ సంప్రదించి వైద్యం తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎంపీ వైద్యులు కూడా ప్రజల్ని మోసం చేయకూడదని ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడి స్థిరాయిడ్స్ బాడీ వారి యొక్క వ్యక్తిగత వ్యాధి నిరోధక శక్తిని తగ్గించవద్దని ఆదేశించడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా అనుకోని సంఘటన అయ్యర్ ఆంటీస్ వల్ల గాని ఇంజక్షన్ వల్ల గాని జరిగినట్లయితే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టబడును ఈ వైద్య బృందంలో డాక్టర్ రణధీర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మరియు డాక్టర్ ప్రసాద్ రాణి గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking