సంగారెడ్డి మార్చి 21 ప్రజ బలం ప్రతినిది: సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా రోడ్లపై వాహనాలను నిల్పకూడదని సీఐ భాస్కర్ చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో సంగారెడ్డి పట్టణ సీఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ ఉపేందర్ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ముందర వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపడంతో రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో రోడ్లపై నిల్పకుండా ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న మినీ బస్ షెల్టర్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలుపాలని రోడ్లపై ఉన్న అంబులెన్స్లను పక్కన పెట్టుకోవాలని పట్టణంలో ఇష్ట రాజ్యాంగ రోడ్లపై వాహనాలు నిలిపితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వాహనదారులు ఆర్టీసీ ఉద్యోగులు పోలీసు సిబ్బంది ఉన్నారు