ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ముధోల్: నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విట్టల్ రెడ్డి బి ఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మంత్రి సీతక్క సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విఠల్ రెడ్డిగారు మాట్లాడుతూ.తిరిగి సొంతగూటికి చేరుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేస్తానన్నారు.
జిల్లాలో రసవత్తరంగా మారనున్న రాజకీయాలు. పోటాపోటీలో ప్రజలకు ఏమేరకు మేలు జరుగుతుందో చూడాలి.
నాయకుల మధ్య పోటీ అభివృద్ధి వైపుగా ప్రజలకి సౌకర్యాలు వసతుల కల్పన దిశగా,ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కార్యాచరణ ఉండాలి అని కోరుతున్నము