ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. మామడ మండల ప్రజా పరిషత్ వైస్ ఎంపీపీ ఏనుగు లింగారెడ్డి, ఆరేపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అరవింద్ రావు గురువారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సామ వికాస్ రెడ్డి ,కె. శ్రీనివాస్ గౌడ్ ,గంగాధర్ సాయి కృష్ణ సాయినాథ్ ,భూమన్న తదితరులు పాల్గొన్నారు