నామకు బాధిత కుటుంబం కృతజ్ఞతలు
ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో క్యాన్సర్ బాధితునికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.3లక్షల ఆర్ధిక సాయం మంజూరైంది. ఈ మేరకు పీఎంవో నుంచి ఎంపీ నామకు లేఖ అందింది. వివరాల్లోకి వెళితే.. వైరా మండలం సోమవారం సుందరయ్య నగర్ కు చెందిన కట్ల శ్రీకాంత్ కుమారుడు కట్ల ధృవంశ్ క్యాన్సర్ తో బాధ పడుతూ , సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం పెద్ద మొత్తం లో డబ్బు అవసరం కావడంతో బాధితుడు ఎంపీ నామ నాగేశ్వరరావు ను కలిసి, తన ఆర్థిక పరిస్థితి వివరించి, ఆర్థిక సాయం కావాలని కోరగా నామ వెంటనే స్పందించి ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడి, మెరుగైన చికిత్స కోసం బాధితునికి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత అమౌంట్ ను పీఎంవో నుంచి నేరుగా ఆస్పత్రికి బదిలీ చేశారు. ఈ డబ్బుతో మెరుగైన చికిత్స చేయించుకుని, త్వరగా కోలుకోవాలని నామ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం నామ నాగేశ్వరరావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది