మోడీకి అందిన ఎంపీ నామ లేఖ

 

యన్ టీ ఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ నామ నాగేశ్వరరావు లేఖ

ఖమ్మం ప్రతినిధి మార్చి 21 (ప్రజాబలం) ఖమ్మం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును దివంగత ప్రముఖ
సినీ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు ప్రకటించి, భవిష్యత్ తరాలకు స్పూర్తిదా యకంగా నిలవాలని కోరుతూ ఇటీవల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు రాసి లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వీకరించినట్లు ఎంపీ నామకు తిరుగు సమాధానం అందింది. ఈ మేరకు ఎంపీ నామకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేకించి లేఖ అందింది. ఎన్ఠీఆర్ కు భారత రత్న అవార్డ్ రావాలన్నది దేశ ప్రజల కోరిక అని, హృదయ పూర్వక భావన అని ఇటీవల మోడీకి రాసిన లేఖలో నామ కోరిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా రంగం తో పాటు మన దేశంలోని సామాజిక-రాజకీయ రంగాలలో విశిష్ట సేవలందించిన మహోన్నతమైన వ్యక్తి అయిన నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌ ) పేరును భారతరత్న అవార్డుకు సిఫార్సు చేయాలని లేఖ లో నామ పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking