చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే సబ్సిడీ ధరలు భరించాలి

చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్
హైదరాబాద్ మార్చ్ 3 (); చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే ఆ సబ్సిడీ ధరలు భరించాలని చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ డిమాండ్ చేసారు. బిఆర్ఎస్ ప్రభుత్వ ఆందోళనలు సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పించారు.కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధర పెంచితే అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని విమర్శించారు.ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దొంగే దొంగ దొంగా అని అరుస్తున్నట్టు ఉందని, ప్రభుత్వ ధర్నాలతో పొలిటికల్ మైలేజ్ రాదని అన్నారు.చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కె.వెంకటేష్ ఎద్దేవా చేశారు. కేంద్రం విధించిన భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలే తప్ప ఆందోళనలు చేయడం విడ్డూరమని వెంకటేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు సిలిండర్లను పెట్టుకొని ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తీరుకు అద్దం పడుతుందని అన్నారు. అప్పట్లో కేంద్రం సిలిండర్ ధర పెంచితే వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ పెను భారాన్ని మోసి ప్రజలకు సిలిండర్ ధర తగ్గించి ఇచ్చిన సంఘటన ఒకసారి అదికార పార్టి నాయకులు గుర్తు చేసుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం లోపల ఒక్కటే.. బయట వేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ప్రజలకు భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మసలుకోవాలే తప్ప ఇలా బహిరంగంగా ఆందోళనలు చేపట్టి ఏం ఉద్ధరించారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవలంబిస్తున్న తీరును రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎండగడతారని అన్నారు. అధికార పార్టీ పొలిటికల్ మైలేజీ కోసం డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు సిలిండర్ ధర తగ్గించాలని.. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే ఆ సబ్సిడీ ధరలు భరించాలని వెంకటేష్ డిమాండ్ చేశారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking