బీజేపీ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు,బీజేపీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు మండిపడ్డారు.శుక్రవారం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా బీ ఆర్ ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. సిలిండర్ ధరలు పెంచుతూ పేదవారి నడ్డి విరుస్తున్న మోదీ కి బుద్ధి చెప్పాలన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ చేస్తూ కార్పొరేట్ల కు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతు వ్యతిరేక చట్టాలు చేసి వెనక్కి తీసుకున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మండలధ్యక్షుడు చుంచు చిన్నయ్య,డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేష్, సర్పంచ్ లు ఆశాది పురుషోత్తం, బండి సత్తయ్య,రాగుల రాజేశం, కౌన్సిలర్లు సురేష్ నాయక్,శ్రీకాంత్, చిప్పకూర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking