ఖమ్మం ప్రతినిధి జులై 18 (ప్రజాబలం) ఖమ్మం జర్నలిస్టులకు గతంలో ఉన్న రైల్వే రాయితీ సౌకర్యాన్ని పున:రుద్ధరించాలని టి యు డబ్ల్యూ జే ఐజేయు ఆధ్వర్యంలో గురువారం రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి వినతి పత్రాన్ని అందజేశారు. కోవిడ్ కి ముందు దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యుల కు రైల్వే ఛార్జీలో 50 శాతం రాయితీ ఉండేదని, కోవిడ్ అనంతరం ఆ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపి వేసిందని టీ యూ డబ్ల్యూ జే ఐజేయు జిల్లా నాయకులు రేణుకా చౌదరికి విన్నవించారు. త్వరలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై రాజ్యసభలో మాట్లాడి కేంద్రంపై వత్తిడి తీసుకొచ్చి రైల్వేచార్జిలో జర్నలిస్టు కుటుంబ సభ్యులకి 50 శాతం రాయితీ ని పునరుద్ధరింపజేసేందుకు కేంద్రం పై వత్తిడి తీసుకురావాలని ఈ సందర్భంగా వారు కోరారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐజేయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు ,జిల్లా నాయకులు నలజాల వెంకటరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ ,టియూడబ్ల్యుజే నగర అధ్యక్షులు మైసా పాపరావు, కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, ఏలూరి వేణుగోపాల్,జి. నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు సౌకర్యం పునరుద్ధ రించేందుకు కేంద్ర పై ఒత్తిడి తీయగలరు కృషి చేయగలరు