చర్చిని కూల్చివేసిన వారిపై వెంటనే చర్యలు తెసుకోవాలి

హైదరాబాద్ సెప్టెంబర్ 20 (చర్చిని కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు జెసిబి, కిరాయి మనుషులతో ఒకరిని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రేణుకుంట్ల ఎల్లయ్య, హైకోర్టు న్యాయవాది ఆర్.సునీల్ కుమార్, బాధితుడు మేడే చంద్రమౌళి సిఎం కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. హైదర్ గూడాలో ఏర్పాటు చేసిన విలేకరుల నమావేశంలో వారు మాట్లాడుతూ మౌలాలిలోని తిరుమల నగర్ లో మేడే చంద్రమౌళి అనే వ్యక్తి 35 సంవత్సరాల క్రితం విద్యానగర్ కు చెందిన రామయ్య వద్ద 550 గజాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఆ స్ధలంలోని కొంత భాగంలో14 సంవత్సరాల క్రితం చంద్రమౌళి కర్మల్ ప్రార్ధనా మందిరం పేరుతో చర్చి నిర్మిచడం జరిగిందన్నారు. కాగా ఈ నెల 15న జే. చంద్రమౌళిగౌడ్ అనే వ్యక్తి పోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను నృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఏలాంటి నోటిసులు లేకుండా జెసిబితో చర్చిని కూల్చివేసి మేడే చంద్రమౌళిని హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, బదితుడికి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.ఈ విషయం పై ముఖ్యమంత్రి జోక్యం చేసుకోని బాధితుడికి న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లోసిహెచ్. సునీల్,ఆర్. మోసేస్స్,పి.యాదమ్మ తదితరులు పాల్ గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking