న్యాయవిచారణకు టీ పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి డిమాండ్
హైదరాబాద్ సెప్టెంబర్ 20 (); టీఏస్ ఐఐసీ పేరుతో ఆలేరు ఎమ్మెల్యే సునితా మహెందయ్ రెడ్డి భూ కబ్జా కు పాల్పడ్డారని టీ పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి.. ఆరోపించారు.టీఏస్ ఐఐసీ కోసం తుర్కపల్లిలో భూ సేకరణ చేస్తున్నారు.సర్వే నెంబర్ 72 లో 155 ఎకరాల భూమి ఉంటె 108 ఎకరాల భూమి కి నోటిఫికేషన్ వేసారు.ఇందులో టీఎస్ ఐఐసీ కి తీసుకుంది 93 ఎకరాలే..మిగిలిన 15 ఎకరాల భూమి ఆలేరు ఎమ్మెల్యే సునితా మహెందయ్ రెడ్డి కబ్జా చేసారని తెలిపారు. బుదవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఎమ్మెల్యే కాకముందు తెల్ల రేషన్ కార్డు ఉన్న గొంగిడి సునితకు ఇప్పుడు వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.మిగిలిన 15 ఎకరాల భూమి పై విచారణ జరగాలని అయోధ్య రెడ్డి..డిమాండ్ చేసారు.అంతే కాకుండా 43 మంది రైతు ల దగ్గర తీసుకున్న భూమి కి ప్రభుత్వం ఇచ్చిన చెక్ లు బౌన్స్ అయ్యాయని తిలిపారు.కాంగ్రెస్ 6 గ్యారెంటీ లతో బీఆర్ఎస్ లో వణుకు మొదలయింది.భయం తో హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.