హైదరాబాద్ సెప్టెంబర్ 20 ();ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ సీనియర్ అడ్వైజర్ కమిటీ సభ్యులు బెజవాడ సుబ్బల లక్ష్మమ్మ, మేకపాటి మనీ మంజరి మరియు డా. మేకపాటి సుప్రియ గార్ల చేతులమీదుగా చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీరమణి , కె నాగేందర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికులు మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.