కుష్టు వ్యాధి పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన: సాయి చౌదరి

వికారాబాద్ సెప్టెంబర్ 20 ();: నిర్లక్ష్యానికి గురైన ఉష్ణ మండల వ్యాధుల్లో కుష్టు సైతం ఒకటి అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. నేడు దారూర్ లో ఇంటి ఇంటికి తిరిగి లెప్రసీ కేసెస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (LCDC) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి చౌదరి మాట్లాడుతూ మైకో బాక్టీరియం లేప్రే అనే సూక్ష్మజీవి ద్వారా సోకే ఈ అంటువ్యాధి 120 దేశాలను పట్టి పీడిస్తుందని, కుష్టు ప్రారంభములో శరీరముపై లేత రంగులో మచ్చలు ఏర్పడి వాటిపై గుచ్చినప్పుడు ఎలాంటి స్పర్శ ఉండదని, వెంటనే వైద్యం చేయించుకోకుంటే వ్యాధి ముదిరి అందత్వము, చేతులు, కాళ్ల వైకల్యానికి దారితీస్తాయని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. ఇండియాలో 2007లో 1,37,000 వేల కొత్త లెప్రసీ కేసులో నమోదయ్యాయి. 2016లో వాటి సంఖ్య 1,35,000. అంటే 9 ఏళ్లలో వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పు ఏమి లేదని, కుష్టు వ్యాప్తి పై 2016లో భారత లెప్రసీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం సైతం ఆందోళన వ్యక్తం చేసింది. దేశీయంగా వెలుగులోకి రాని కుష్టు కేసులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి సర్వేలో తేలిందని, సరైన అవగాహన లేకపోవడంతో, చాలామంది తమకు కుష్టు సోకినట్లు తొలిదశలోనే నమోదు చేసుకోవడం లేదు. పైగా 2005 తర్వాత వ్యాధి నిర్ధారణ మందగించి బాధితుల్లో తీవ్ర వైకల్యాలు అధికమయ్యాయి. ఈ క్రమంలో 2018 నాటికి లెప్రసీని నిర్మూలించి ఆ స్థితిని కొనసాగించాలని జాతీయ వైద్య విధానం-2017న సూచించింది. ఇండియాలో 2021 లో లెప్రసీ వల్ల 18 వందల మందికి పైగా తీవ్ర వైకల్యాల బారిన పడ్డారు అని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అన్నారు. ముందుగా లెప్రసీ వ్యాధి పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. వైద్య బృందాల సాయంతో తొలిదశలోనే బాధితులను గుర్తించి సరైన చికిత్స ద్వారా శారీరక వైకల్యాన్ని నివారించాలని సాయి చౌదరి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking