రాష్ట్ర టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం సిఎస్ లకు విజ్ఞప్తి
జగిత్యాల, ఏప్రిల్,03
తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలను వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంత కుమారి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతూ కుమారి ప్రసాద్ లకు సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన రిప్రజెంటేషన్ అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు 20 18వ సంవత్సరం జరిగిన బదిలీల అప్పటినుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో బదిలీలు జరగలేదు అప్పటినుండి ఇప్పటివరకు ఒకటే ప్రాంతంలో అదే ప్రాంతంలో అక్కన్నే వాణిజ్య పనుల శాఖ ఉద్యోగులు పనిచేయుచున్నారు రెండు సంవత్సరాల క్రితం వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు డి సి టి ఓ మరియు డీసీటీవోలకు సీటీవో మరియు సిటిఓ లకు అసిస్టెంట్ కమిషనర్లుగా అసిస్టెంట్ కమిషనర్లకు జాయింట్ కమిషనర్లుగా ప్రమోషన్లు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పని చేస్తున్నారు అక్కడనే ప్రమోషన్లు కల్పించి రెండు సంవత్సరాల నుండి అదే ప్రాంతంలో అదే కార్యాలయంలో పనిచేస్తున్నారు ఏదైనా ప్రభుత్వ శాఖల్లో ప్రమోషన్ ఇచ్చిన వెంటనే అక్కడి నుండి వేరే ప్రాంతానికి వేరే కార్యాలయానికి బదిలీ చేస్తారు కానీ తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో అలా జరగలేదు అప్పటినుండి ఇప్పటివరకు అదే కార్యాలయంలో అదే కుర్చీలో కూర్చొని వారు అక్కడే పని చేయుచున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు మొన్నటి వరకు ఫైనాన్సు ఎండింగ్ ఇయర్ ఉండే మార్చి నెల గడిచి ఏప్రిల్ నెల ప్రారంభమైందని ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో పనిచేయుచున్న ఉద్యోగులకు సాధారణ బదిలీలు వెంటనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతా కుమారి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ కమిషనర్ నీతు కుమారి ప్రసాద్ లకు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.