భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 03 : ఈ నెల 8వ తారీకు శనివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో జనం తరలిరావాలని ఏ ఐ సి సి మెంబర్ ఎక్స్ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు. సోమవారం నాడు మండలంలోని ముత్యంపేట గ్రామంలో గల ఏ ఎల్ ఆర్ ఫంక్షన్ హాల్ దండేపల్లి మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు…ఈ సందర్భంగా ఈ నెల 8వ తారీఖు శనివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు జరిగే భారీ బహిరంగ సభకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎసిసి ప్రధాన కార్యదర్శి కే సి వేణుగోపాల్,తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలందరూ ఈ సభ హాజరవుతున్నారని ఆయన ఈ ఏడాది చివరి ఆఖరిలో అసెంబ్లీ ఎన్నికల ఉన్నందున మంచిర్యాలలో పెట్టే ఈ సభ రేపు జరగబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ దశ దిశను నిర్ణయించే సబాని పేర్కొన్నారు ఎంతో పటిష్టాత్మకంగా తీసుకున్న ఈ సభను ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త విజయవంతం చేయాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో దండేపల్లి మండలం జెడ్పిటిసి ఎంపీటీసీలు సర్పంచులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking