సోమవారం నుండి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్ పరిశీలన
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన
….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి ఏప్రిల్ 3 ప్రజ బలం ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, కరుణా హై స్కూల్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలోఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని చీఫ్ సూపరింటెండెంట్ లకు సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు.
అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండటంపై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.
కలెక్టర్ వెంట డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ విజయకుమార్, చీఫ్ సూపర్డెంట్లు, తదితరులు ఉన్నారు.