పార్లమెంట్ ఎన్నికలు 2024 ఎన్నికల సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్‌ అమలు

 

రామగుండం పోలీస్ కమిషనర్ ఏపీఎస్ ఐజీ ఎం శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 10 : పార్లమెంట్ ఎన్నికలు 2024 సందర్భంగా మే 13 న ఎన్నికలు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దపల్లి పార్లమెంట్ పరిదిలోని 22-ధర్మపురి నియోజకవర్గం (పాక్షిక స్థాయిలోని) 23-రామగుండము,25- పెద్దపల్లి నియోజకవర్గంలలో  రేపు సాయంత్రం అనగా తేది : మే 11 శనివారం సాయంత్రం 6:00 గంటల నుండి మే 13 సోమవారం సాయంత్రం 6:00 గంటల వరకు మరియు 24-మంథని నియోజకవర్గం,03-చెన్నూరు, 02-బెల్లంపల్లి,04-మంచిర్యాల నియోజకవర్గలలో తేది: మే 11 శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి తేదీ  మే 13 సోమవారం సాయంత్రం 4:00 గంటల వరకు,144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఐపిఎస్ (ఐజీ) ఎం.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు.1.రామగుండం పోలీస్ కమీషనరరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగొద్దని తెలిపారు.2.రాజకీయ పార్టీలకు చెందిన జెండాలు, గుర్తులు, ప్లకార్డులు ధరించొద్దని, ప్రదర్శించొద్దని తెలిపారు.
3.మైకులు,లౌడ్‌ స్పీకర్లు వాడరాదని, రాజకీయ పార్టీలకు సంబందించిన పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని పేర్కొన్నారు.4.విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు.
5.ధర్నాలు,రాస్తారోకోలు, ఊరేగింపులు,టపాకాయలు కాల్చడం లాంటి కార్యక్రమాలను నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై,ఎన్నికల సంఘం యొక్క  నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking