రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 10 మే 2024:
బీ.ఆర్.ఏస్ పార్టీ చేవెళ్ల నియోజక వర్గం నుండి పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకై మొదటగా ఉన్న 1 నంబర్ కార్ గుర్తు బటన్ పై నొక్కి మీ అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించ వలెనని మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కట్టుగా హైదరాబాద్ కు కూతవేటున ఉన్న మణికొండ కౌన్సిల్ 11 వ వార్డ్ నెమలి నగర్ పరిసర ప్రాంతాలలో వీధి వీధికి గడప గడపకు కే.సి.ఆర్ సమయంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు పరచిన విధానాన్ని వివరించుతూ శుక్రవారం రోజున తిరిగడం జరిగినదనీ, ఈ ప్రాంతమంతా బహుళ అంతస్తులకు ప్రసిద్ధి గాంచినప్పటికి అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు మణికొండకు చిట్ట చివరగా ఉన్న నెమలి నగర్ చుట్టూ ఎంతో అభివృద్ధి గాంచినను మధ్యణ ఉన్న నెమలి నగర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సరైన రోడ్లు లేకుండా అభివృద్ధికి నోచుకోలేదని అక్కడి ప్రజానీకం తమ మనోవ్యదను తెలియ జేసినారు, ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్, మణికొండ బీ.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షుడు బుద్దోల్ శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, బుద్దోల్ కావ్య, శైలజా వినోద్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభగల్ల ధనరాజ్, సీనియర్ స్థానిక నాయకులు గుట్టమీది నరేందర్, గొరుకంటి విఠల్ మరియు అందె లక్ష్మణ్ రావు, సింగదాసరి ప్రకాశ్, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, బాబు, బండమీది మల్లేశ్, యువ నాయకులు, మహిళా నాయకురాల్లు తది తరులు పాల్గొన్నారు.
