…. వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ
సంగారెడ్డి మే 10 ప్రజ బలం ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్ గ్రామంలోని ఫామ్ హౌస్ లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు కు మద్దతు తెలుపుతూ, ఈ పార్లమెంటు ఎన్నికల్లో నీలం మధును గెలిపించే విధంగా కృషి చేస్తామని టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం మధు పెదల పెన్నిధి, అపదలో బీదలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, అన్ని విధాల సాధకబాధకాలను ఆప్యాయంగా ఆదుకునే వ్యక్తి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు అని అన్నారు. ఈ మెదక్ పార్లమెంటు సీట్లు నుండి ఆనాడు ఇందిరా గాంధీ గెలిచి ప్రధానమంత్రి హోదా దక్కించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కింది. అలాగే ఇప్పుడు నీలం మధును గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చి అమలు పరుస్తున్న ది.కాబట్టి ఆయనకు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్బిఎస్ వ్యవస్థాపకులు జన్ను కనకరాజు, 59 కులాల కన్వీనర్ చింతల రాజలింగం ,టి ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనోల్ల బాలరాజు మాదిగ, టిఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ మాదిగ, టిఎమ్ఆర్పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంపల యాదయ్య,మెదక్ జిల్లా అధ్యక్షులు బి దుర్గయ్య, టిఎంఆర్పిఎస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ కొంగరి కృష్ణ మాదిగ, కార్యవర్గ సభ్యులు యేసయ్య, ప్రశాంత్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
