మనోహరాబాద్ లో బీఆర్ఎస్ కి వరుస షాక్ లు…

 

బీఆర్ఎస్ వీడిన మాజీ సర్పంచులు…

మనోహరబాద్ మే 10 ప్రజాబలం న్యూస్ :-
రాష్ట్రం లో బిఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపం అని మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి అన్నారు.బిఆర్ఎస్ లో మోసగాళ్లు,దొంగలే మిగుళ్తారని అన్నారు.మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి,నాయకులు శేఖర్ రెడ్డి వారి అనుచరులతో కలిసి నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.వారికి నర్సారెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బిఆర్ఎస్ లో ఉంటే మోసపోవడం తప్ప ఏమిలేదని అన్నారు.ఈ సందర్బంగా సంజీవరెడ్డి,శేఖర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ లో ఉంటే విలువ లేదని ప్రజలకు సేవ చేయలేమని సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న సంక్షేమ విధానాలు నచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు తెలిపారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనుగడ సాగిస్తుందని అందుకే ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసిస్తున్నారని అన్నారు.వారి తో నాయకులు మాజీ సర్పంచి డాక్టర్ పెంటన్న, సాధు సత్యనారాయణ, సింగి మహిపాల్ రెడ్డి,రమేష్ చారి,మస్తాన్ పటేల్,రామిరెడ్డి,రవి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking