కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని కొర్విచెల్మ గ్రామం కాంగ్రెస్ నాయకులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 10 : పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరడం జరిగింది.శుక్రవారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షురాలు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం 100 రోజు పని వేళ లో వారి వద్ద కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ చేస్తూన్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు గుర్తుంచుకోవాలి,ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.మన అందరికి తెలుసు రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థి గెలుస్తే అభివృద్ధికి కృషి చేసే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముద్దసాని వేణు, ముత్తె వెంకటేష్,కారుకూరి బాలయ్య,మంగం మాన్కు,గొపతి తిరుపతి,రవి,దొడ మధుకర్, సత్తయ్య,యడరపు రవి, చంద్రమౌళి,శ్రీనివాస్,గ్రామ నాయకుల తదితరులు పాల్గొన్నారు.