కాంగ్రెస్ పాలనలోనే ఉపాధి హామీ 100 రోజుల పని కల్పించబడింది. హస్తం గుర్తుకు ఓటు వేసి పోరిక బలరాంనాయక్ ను గెలిపించండి

  • డిసిసిబి డైరెక్టర్ మాజీ జడ్పిటిసి మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి మే 10 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పాలనలోనే వేసవికాలంలో 100 రోజుల ఉపాధి హామీ పని పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలోని రైతు కూలీలకు వేసవికాలంలో ఎలాంటి వ్యవసాయ పనులు ఉండకపోవడం వల్ల ఉపాధి కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ కల్పించిందని డిసిసిబి డైరెక్టర్ , మాజీ జెడ్పిటిసి జిల్లా కాంగ్రెస్ నాయకులు మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు కొండాయిగూడెం రాయగూడెం బండిపాడు రుక్కితండా పరిసర ప్రాంతాలలో ఉపాధి హామీ పని పథకం ద్వారా వందలాది ప్రజల ను పనిచేయుచున్న ప్రాంతాలకు చేరుకుని మల్లి బాబు యాదవ్ హస్తం గుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి వ్యక్తిని ప్రచారం చేశారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు,రైతు కూలీలకు, నిరుద్యోగులకు దళితులకు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎన్నో హామీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి oదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చిందని, గతంలో హామీలు ఇవ్వకుండానే 108 ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు ఇప్పటికీ విజయవంతం అవుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ చలవేనని నని, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలుగుతుందని, ఇందిరమ్మ హయాంలో, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నే ఇండ్లు కట్టుకున్నామని, రైతులకు ఉచిత విద్యుత్తు, రూపాయికి కేజీ బియ్యం లాంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలనిమల్లి బాబు యాదవ్ ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో గుగులోత్ రవి గుగులోత్ బాసు, జరపల వాల్య, కె వెంకన్న భద్రయ్య రమేషు చల్ల వీరబాబు చల్ల కృష్ణ, కాటంరాజు అనిల్ ఎల్లయ్య, జె సాయిరాం భీముడు అశోక్ రాములు దేవ్ సింగ్ మరియు ఉపాధి హామీ పని పథకం కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking