ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఉత్కూర్ కు చెందిన రాజం కుమార్ (25)యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడని శనివారం ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. మృతుడు డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఏ పని చేయడం లేదని,ఇంట్లో తల్లితండ్రులు ఏదైనా పని చేసుకో లేకుంటే వ్యవసాయ పనులకు రావాలని కాలిగా తిరగకూడదని మందలించారన్నారు.దీంతో మనస్తాపం చెంది ఈనెల 8 న అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబసభ్యులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం సమయంలో మృతి చెందాడన్నారు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు.మృతుని తండ్రి రాజం నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై పి చంద్రకుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.