మెదక్ తూప్రాన్ మే 10 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రవీందర్ గుప్తా మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. కాంగ్రెస్ పథకాల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ చేతి గుర్తుకు ఓట్లు వేసి నీలం మధును గెలిపించాలని ఓటర్లను కోరా రు. ఇంటింటికి తిరిగి ఓటర్లను కలిసి కరపత్రాలను పంచుతున్నారు. కాంగ్రెస్ జిల్లా నాయకులు మామీండ్ల కృష్ణ ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు రవీందర్ గుప్తా కౌన్సిలర్లతో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఇండ్లకు కాంగ్రెస్ స్టిక్కర్లను అతికించి జోరుగా ప్రచారం చేశారు. నీలం మధును గెలిపిస్తేనే మున్సిపల్ లో అభివృద్ధి పనులకు
అవస రమైనన్ని నిధులు కేటాయించబడతాయని, చెప్పారు. కాంగ్రెస్
నాయ కుల ఇంటింటి ప్రచారానికి మంచి స్పందన వచ్చింది. తూప్రాన్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ కి మంచి పట్టు ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నందున ఈసారి ఎంపీ ఎన్నికల్లో మరింత భారీ మెజారిటీ వస్తుందని వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్, కొడిప్యాక నారాయణ గుప్తా, భగవాన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నాయకులు గడప దేవేందర్, మహమ్మద్ అప్సర్ , బుడ్డ భాగ్యరాజ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,
శశి భూషణ్ రెడ్డి, శ్రీధర్, రఘపతి, నరేందర్, దుర్గం నాగేష్,నాగులు, ధనరాజ్, బాయికాడి వెంకటేష్, ఉమర్, అనిల్, విజయ్,గౌతమ్ గౌడ్,మామిండ్ల శ్రీనివాస్,ఆసిఫ్, నర్సింలు,అజయ్,
వెంకటేష్,సత్యనారాయణ,కృష్ణ ముదిరాజ్,నర్సింలు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
