వేసవికాలం పూర్తయ్యే వరకు త్రాగునీరు సరఫరాకు చర్యలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 10 : వేసవి కాలం పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ సరిపడ త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలోని గల ఎల్లంపల్లి ప్రాజెక్టును మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, మిషన్ భగీరథ ఈ.ఈ మధుసూదన్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎల్లంపల్లి ప్రాజెక్టు సెగ్మెంట్ పరిధిలో వేసవికాలం పూర్తయ్యే వరకు నిరంతర త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి అందుతున్న తాగునీటి సరఫరా ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సాధించాలని, సమస్యలు తలచినట్లైతే త్వరితగచిన పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. నీటి వనరులు అందుబాటులో లేని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తాగునీటి సరఫరా చేసినందుకు చర్యలు చేపట్టడం తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత అధికం అవుతున్న నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking