వడ్డేపల్లి వీరయ్య స్మారకార్థం డప్పు కళాకారులకు టీ షర్ట్లు పండ్లు పంపిణీ చేసిన వడ్డేపల్లి రాజగోపాల్.

 

వీణవంక ప్రజాబలం ప్రతినిధి మార్చి 15

వీణవంక మండలం వల్బపూర్ గ్రామానికి చెందిన వడ్డేపల్లి రాజగోపాల్ వారి తండ్రి వడ్డేపల్లి వీరయ్య స్మారకార్థం కుటుంబ సమేతంగా గ్రామంలోని డప్పు కళాకారులకు, టీ షర్ట్ లు, పండ్లు పంపించేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.సమాజ సేవలో భాగంగా గ్రామంలోని డప్పు కళాకారులకు తండ్రి జ్ఞాపకార్థం డప్పు కళాకారులకు టీ షర్ట్ లు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది.సమాజంలో ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగంగా చేతనైన సహాయాన్ని పేదలకు అందజేయాలని, స్వగ్రామంలో గ్రామస్తుల అండదండతో కార్యక్రమం చేయడం చాలా సంతోషం ఉందని అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజగోపాల్, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు పల్లెవేన గట్టయ్య, డప్పు కళాకారుల అధ్యక్షుడు మారముల మల్లయ్య, సదాశివరెడ్డి, శ్రీపతి రెడ్డి,తిరుపతిరెడ్డి,లక్ష్మయ్య,
నాగరాజు,అందే కుమార్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking