వినియోగదారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్ సంధ్యారాణి

 

ప్రజాబలం వరంగల్ ప్రతినిధి, మార్చి15 ::

వినియోగదారుల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్‌ జి. సంధ్యారాణి
అన్నారు. ప్రపంచ వినియోగ దారుల దినోత్సవం పురస్కరించుకొని కలెక్టరేట్‌లో శుక్రవారం వినియోగదారుల కొరకు న్యాయమైన, బాధ్యతాయుతమైన కృత్రిమ మేధస్సు ” అనే అంశంపై
నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వినియోగదారుల హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కల్పించే కరపత్రాలను అదనపు కలెక్టర్‌ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి సంధ్యారాణి, జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ప్రవీణ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సిద్ధార్థ రెడ్డి, డిసిఐసి ప్రెసిడెంట్ సుదర్శన్, ఓరుగల్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కమిటీ ప్రెసిడెంట్ దామోదర్, జనరల్ సెక్రటరీ శ్రావణ్ కుమార్, కన్జ్యూమర్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, నంద కుమారి , జిల్లాలోని రేషన్ డీలర్స్, గ్యాస్ డీలర్స్, పెట్రోల్ బంక్ , మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking