– శాలువాలు…బొకేలతో శీనన్నకు శుభాకాంక్షలు
– ఉమ్మడి జిల్లా నుంచి తరలొచ్చిన ప్రజానీకం
– జనసందోహంతో కిక్కిరిసిన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 18 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని ఆయన గుమ్మంలో తొలిసారిగా అడుగుపెట్టిన మంత్రి పొంగులేటికి ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఘనస్వాగతం పలికింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లాకు విచ్చేసిన శీనన్నకు శాలువాలు, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. పూల మొక్కలను ప్రేమతో అందించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఉ న్నతస్థాయి వర్గానికి చెందిన వారు మొదలు సామాన్య ప్రజానీకం వరకు ప్రతి ఒక్కరూ శీనన్నను కలిశారు. ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారు చేసిన చిరు సత్కారాలను స్వీకరించారు. ఉమ్మడి జిల్లా ప్రజల ఆదరాభిమానాలే తనకు ఉన్నత పదవి వరించేలా చేసిందని ఈ సందర్భంగా పొంగులేటి పేర్కొన్నారు. ఉదయం 06.30గంటల నుంచి మొదలైన తాకిడి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా కొనసాగింది. శీనన్నను కలిసేందుకు వచ్చిన వాహనాలు క్యాంపు కార్యాలయం బయట బారులు తీరాయి.