జగిత్యాల, డిసెంబర్ 18: ఎస్సి వర్గీకరణ సాధనకై తెలంగాణ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం తొలిరోజు మౌనదీక్ష సాగింది. తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడమర్తి రవి సారథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేశారు. మూతుకి నల్ల రిబ్బన్ కట్టుకొని మౌన దీక్ష సాగించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టి మాదిగ జేఏసీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మెడపట్ల దుబ్బయ్య నాయకులు చైతన్య, వంశీ, సంపత్, చందు, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.