పండితాపురంలో శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర కళ్యాణ మహోత్సవము ను ప్రారంభించిన టిపిసిసి కార్యదర్శి రాం రెడ్డి గోపాల్ రెడ్డి, మేకల మల్లిబాబు యాదవ్ పోడేపూడి విఠల్ రావు
ఖమ్మం ప్రతినిధి మార్చి 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం నేటి నుండి 22వ తారీకు వరకు పండితాపురంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మరియు జాతర కార్యక్రమం సందర్భంగా ఈరోజు దేవాలయం ను తోరణాలంకరణ చేసి, స్వామి వారికి విశేష అలంకరణ చేసి ఉదయం 8 గంటలకు స్వామివారిని జయ జయ ద్వానాల మధ్య వేద పండితుల మంత్రోచ్ఛారణల తో పెండ్లి కుమారు ని చేయు కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాం రెడ్డి గోపాల్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బోడెపూడి విఠల్ రావు కు కొమ్మనేపల్లి కొండాయిగూడెం పండితాపురం భక్త బృందం ఘన స్వాగతం పలికారు. వీరికి వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం పలికారు. కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన ఈ దేవాలయంకు ఎంతో విశిష్టత ఉన్నదని, ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని, దీన్ని ప్రభుత్వ దృష్టి లో పెడతామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే జాతర కార్యక్రమాన్ని రాం రెడ్డి గోపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ ఈ నాలుగు రోజులపాటు గ్రామీణ క్రీడలైన ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు, లాంటివి పెద్ద ఎత్తున జరిగేవని అలాంటి కార్యక్రమాలను తిరిగి చేపట్టే విధంగా కృషి చేస్తామని పలికారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, ఎంపీటీసీ లక్ష్మయ్య,మేకల మల్లికార్జునరావు, బానోత్ నరసింహా నాయక్,, మేకపోతుల మహేష్ ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, చాకలి రాములు నాగండ్ల జగ్గయ్య ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాడిబండ్ల ప్రసాద్,దొడ్ల వేణు, తోటకూరి భద్రయ్య, అంబడిపూడి వెంకటయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, బండి ఉపేందర్, బండి లక్ష్మీనర్సు, బండి ఎల్లయ్యబండి వీరబాబు, తురక బిక్షం, డేరంగుల తిరపయ్య బొమ్మగా నిపిచ్చయ్య కొమ్మినేని శ్రీనివాసరావు, మొగిలి శ్రీను బానోత్ వీరనాగులు బత్తుల వీరబాబు జలగం శ్రీను తొండల ముత్తయ్య, జన్నారపు లింగయ్య, చల్ల మల్లయ్య, చల్ల వెంకన్న, బొగ్గారపు రామచంద్రయ్య, గుంటుపల్లి వెంకట్రావు, తిరుమల కొండ బాబు, బద్దల శేఖర్, పల్లె ఉపేందర్, అంబడిపూడి రంగయ్య, బానోత్ నాగేంద్రబాబు, దొడ్డ శ్రీను మరియు కొమినేపల్లి కొండాయిగూడెం పండితాపురం భక్తజనం బృందం, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు