బొగ్గు బ్లాక్ ల వేలం పాటకు నిరసనగా సిపిఎం,సీఐటీయు ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్, ఫ్లాకార్డ్ లతో నిరసన చేయడం జరిగింది.

బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకే ఇవ్వాలి.

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 03 : సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు లక్షెట్టిపేట మండలంలో సిపిఎం,సీఐటీయు ఆధ్వర్యంలో బొగ్గు బ్లాక్ వేలం పాటను రద్దు చెయ్యాలి.బొగ్గు బ్లాక్ ను సింగరేణి సంస్థకివ్వాలని. బీజేపీ,మోడీ ప్రయివేట్ కరణ విధానాలు విరమించుకోవాలని నల్ల రిబ్బన్,ఫ్లాకార్డ్ లతో నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది.బీజేపీ,మోడీకి దేశ ప్రజలు గుణపాఠం చెప్పిన కూడ తన వక్ర బుద్ధి మనుకోడం లేదు.దేశ ప్రజల సంపదను ప్రజలకు మేలు చెయ్యడం కాకుండా ప్రయివేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం చేస్తుంది.మంచిర్యాల జిల్లాలోని శ్రావణ పల్లి బ్లాక్ ను వేలం పాటలో పెట్టీ సింగరేణి సంస్థకివ్వకుండ ప్రయివేట్ కంపనిలకు ఇవ్వడం కోసం బీజేపీ,మోడీ తహతహలాడుతున్నారు.
తమ వైఖరి మార్చుకోకుంటే మంచిర్యాల జిల్లా బీజేపీ,మోడీకి బుద్ది చెప్పడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సిపిఎం, సీఐటీయు నాయకులు శోభ,కాంతమ్మ,రజిత, పోసమ్మ,మల్లమ్మ,ఎల్లవ్వ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking