తూప్రాన్ మున్సిపాలిటీలో కన్నుల పండువగా నరసింహుడి కళ్యాణ మహోత్సవం..

 

వేదమంత్రాలతో స్వామివారికి సుదర్శన హోమం..
మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం.

భారీగా తరలివచ్చిన భక్తజన సందోహం …

మెదక్ తూప్రాన్ మే 22 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి నాలుగవ వార్డులో రామాలయం సమీపంలో వందల సంవత్సరాల క్రితం వెలసిన శ్రీ కూర్మ నరసింహస్వామి 41 వ వార్షిక మహోత్సవం స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా వైభవోపేతంగా వేద పండితుల సమక్షంలో బుధవారం నిర్వహించారు.
స్వామివారికి పూజలు నిర్వహించి కాంగ్రెస్ నాయకులు మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం . నిర్వాహకులు ఆలయ కమిటీ అధ్యక్షులు తుఫాన్ మున్సిపాలిటీ చైర్మన్
మామిండ్ల జ్యోతి కృష్ణ ,,
ఆలయ ప్రధాన కార్యదర్శి కంటాయపాలెం వేణుగోపాల్, విద్యాసాగర్, ఆలయ భక్త బృందం వారి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు బుధవారంతో ముగిసాయి.
బుధవారం స్వామివారికి అభిషేకం సుదర్శన హోమం స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవతంగా నిర్వహించారు. అర్చకులు అహోబిలం ప్రవీణ్, వెంకటేశ్వర్లు వేదమంత్రాలతో శాస్త్రోయుక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు.. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ ముదిరాజ్, కౌన్సిలర్లు కోడిప్యాక నారాయణ గుప్తా , రాముని గారి శ్రీశైలం గౌడ్,
పల్లెర్ల రవీందర్ గుప్తా, జిన్న భగవాన్ రెడ్డి జమాల్పూర్ నర్సోజి,
గడ్డం ప్రశాంత్ కుమార్ ,
పంచాయతీ రాజ్ ఈ ఈ నర్సింలు,
సిద్ధి రాములు, మాజీ ఎంపిటిసి వెంకటేష్ యాదవ్, నాయకులు యాదవ సంఘం అధ్యక్షులు తుమ్మెట శ్రీనివాస్ యాదవ్, బొల్లు నాగులు, శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు మాలె కుమార్, శ్రీనివాస్ చారి,మల్లికార్జున్ గౌడ్ హుస్సేన్, చాడ కోటేశ్వరరావు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking