పి డి ఎస్ బియ్యంని అక్రమంగా తనిస్తుండగా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 21 : జగిత్యాల నుండి మహారాష్ట్రకి అక్రమంగా పి డి ఎస్ బియ్యం తరలిస్తున్న ఐచర్ వాహనన్ని పట్టుకుని, డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు సుమారు 4,50,000/- రూపాయల విలువ గల150 క్వింటాళ్ళ ప్రభుత్వ రేషన్ బియ్యం ఐచర్ వ్యాన్ స్వాధీనం, రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ గేట్  సమీపంలో,మంగళవారం రోజు ఉదయం ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని మహారాష్ట్ర కి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ ఉపేందర్ సిబ్బంది తో  కలిసి అనుమానిత ఐచర్ వాహనన్ని  అపి తనిఖీ చేయగా అందులో సుమారు 150 క్వింటాళ్ళ రేషన్ బియ్యం పట్టుబడ్డాయి.అట్టి ఐచర్ వాహనం నడిపే వ్యక్తి అయినా మహుముద్ అలీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా,ఆసిఫాబాద్ జిల్లా వాంకిడికి చెందిన షoశీర్ అనే వ్యక్తి జగిత్యాల జిల్లా  లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి,మహారాష్ట్ర కి తరలిస్తాడని అందులో భాగంగానే అతనితో చేసుకున్న ఒప్పందం మేరకు అతనికి సంబంధించిన బియ్యాన్ని ఈ రోజు రహస్యంగా తరలిస్తున్నానని చెప్పినాడు.అనంతరం అతడిని మరియు 150 క్వింటాళ్ళ రేషన్ బియ్యం కలిగినా అట్టి ఐచర్ (టి ఎస్ 19 టి ఏ 5987)నెంబర్ గల వాహనాన్ని  తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ వారికీ   అప్పగించడం జరిగింది.
నిందితుల వివరాలు:-
1) ఎమ్ డి. మహాముద్ అలీ తండ్రి సర్వర్,వయస్సు : 36, కులం: ముస్లిం ఓసిసి : డ్రైవర్,గ్రామం వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా
2)శంశిర్ ఖాన్ తండ్రి ఖన్సిమ్ ఖాన్ గ్రామం వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా (పరారిలో వున్నాడు)రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎమ్ శ్రీనివాస్.ఐపీఎస్(ఐజీ) టాస్క్ ఫోర్స్ సిఐ సంజయ్ ని,ఎస్సై ఉపేందర్ ను సిబ్బందిని అభినందించడం జరిగింది.అంతే కాకుండా  ప్రతి ఇల్లీగల్ యాక్టివిటీ మీద,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారి పైన,అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారి పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి సమాచారం సేకరించి అణిచివేయడం, జరుగుతుందనీ,అక్రమార్కుల మీద నిరంతరం నిఘా ఉంటుందని,వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, గంజాయి రవాణా,నకిలీ పత్తి విత్తనాలు,జీరో వ్యాపారాలు, అక్రమ భూదందాలు భూకబ్జాలు, నకిలీ వ్యాపారాలు,జాబ్ ఫ్రాడింగ్ , ఇసుక,బొగ్గు,పిడియస్ రైస్ అక్రమ రవాణా,క్రికెట్ బెట్టింగ్,గేమింగ్ ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామనీ, ఇలాంటి వాటిపై సీపీ టాస్క్ ఫోర్స్ తో వరుస దాడులు నిర్వహించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ,సీపీ టాస్క్ ఫోర్స్,ప్రజల సహకారంతో అధునాతన సాంకేతిక పద్ధతుల ద్వారా అక్రమార్కుల కదలికలను గుర్తించి అక్రమ వ్యాపారాలపై, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై వరుస  దాడులు నిర్వహిస్తుందనీ సీపీ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking