వరి కోనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి

రాష్ట్ర ప్రత్యేక అధికారి కార్యదర్శి,కమీషనర్ కృష్ణ ఆదిత్య

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 21 : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు సమన్వయంతో కృష్ణ చెయ్యాలని రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి,కార్మిక శాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.మంగళవారం జిల్లాలోని నస్పూర్ మండలం సీతారాంపల్లిలో మెఫ్మా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్,జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సబావత్ మోతిలాల్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి,ఇన్ చార్జ్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి హరికృష్ణ పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, నస్పూర్ మున్సిపల్ కమిషనర్ సత్తిష్,లతో కలిసి ఆకస్మాక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి మాట్లాడుతూ…రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల మేరకు రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు సమయంలో రైతుల సంబంధిత వివరాలు, విక్రయించిన ధాన్యం వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల సౌకర్యార్థం త్రాగునీరు, నీడ ఇతరత్రా మౌలిక సదుపాయాలు కల్పించాలని రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం తరలించేందుకు అవసరమైన గని సంచులు,వర్ష భవ పరిస్థితుల దృష్ట్యా ధాన్యం తడవకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.రైతుల వద్దనుండి కొనుగోలు చేసిన వరి ధాన్యం ను ట్యాగింగ్ చేయబడిన రైస్ మిల్లర్లకు కేటాయించిన మేరకు తరలించే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వహలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking