మెదక్ తూప్రన్ మే 21 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డు లో రామాలయం సమీపంలో వెలసిన అతి పురాతన శ్రీ మహాన్వితమైన కూర్మనారసింహస్వామి దేవాలయంలో గత రెండు రోజులుగా పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండవ రోజు స్వామివారి అభిషేకం హనుమాన్ ఆకు పూజ చందన విలేఖనము సుదర్శన హోమం పూజా కార్యక్రమాలను అర్చకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో మరియు నిర్వాహకులు తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ గార్ల సమక్షంలో శ్రీ కూర్మానసింహస్వామి 41 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఘన చరిత్ర గల దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి వారి కోరికలను తీర్చుకుంటున్నారు 22వ తేదీ బుధవారం ఉదయం హోమము 10 గంటలకు స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపాకటాక్షాలు స్వీకరించి అనంతరం మహా అన్నదాన ప్రసాదాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీచూర్ణం విద్యాసాగర్ అహోబిలం హరి ప్రసాద్, కంటాయపాలెం వేణుగోపాల్,
గడ్డం ప్రశాంత్, శ్రీధర్ ప్రాజప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.
