ఘనంగా రాజీవ్ గాంధీ 33 వ వర్ధంతి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 21 : భారత దేశంలో సమసమాజం నిర్మించ డానికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు.మంగళవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో భారత రత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33 వ వర్ధoతిని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ… భారతదేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్‌ గాంధీనేనని,దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది స్వర్గీయ రాజీవ్‌ గాంధీనే అన్నారు.అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి.అరిఫ్,మాజీ ఎంపీటీసీ మడిపెళ్లి స్వామి,చుంచు రవి,శ్రీధర్,నవాబ్ ఖాన్, ఉత్తురి రవీందర్, కొత్త వెంకటేశ్వర్లు,అమీర్ ఖాన్,హాజీ, మినుముల శాంతికుమార్, చాతరాజు రాజేష్,గుత్తికొండ శ్రీధర్,నయిమ్,అంజూమ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking