— జీవ వైవిధ్యాన్ని, పర్యావరణ అసమతుల్యతను మనమే మెరుగుపరచాలి.
— బాధ్యతగా తీసుకోకపోతే మానవమనుగడ ప్రశ్నర్ధకమే.!
— “పర్యావరణ మిత్ర” అవార్డు గ్రహిత – పిట్టల రవిబాబు.
ప్రకృతిని, పంచభూతాలను, పర్యావరణాన్ని, సహజవనరులను మానవులు మరియు మిగతా 84 కోట్ల జీవరాసులు మమేకమై, కాలానుగుణంగా అవసరమున్నంతే తమ జీవన సౌలభ్యనికి వినియోగించుకొని ఆవాసాల మనుగడను, జీవ వైవిధ్యాన్ని కాపాడుకొంటూ జీవనం సాగించి పూర్వీకులు తమాకిచ్చిన పర్యావరణ పరిస్థితులు తము అనుభవించి అంతే జీవన ప్రమాణం గల ఆవరనాలను రాబోయే తరాలకివ్వాలి. ఇలాంటి జీవనశైలి వల్ల జీవవైవిధ్యానికిగానీ, పర్యావరణానికిగాని, ఇతర సమస్త సజీవ, నిర్జీవ అనుఘటకాలకు ఎలాంటి హాని ఉండదు.
ప్రతీ సంవత్సరం లాగే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం మే, 22 న, ప్రపంచదేశాలు జీవవైవిద్యాన్ని రక్షించేందుకు జరుపుకుంటాయి.
“ప్రణాళికలో భాగం అవ్వండి”, అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2024 యొక్క థీమ్, కున్మింగ్-మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అమలుకు మద్దతు ఇవ్వడం ద్వారా జీవవైవిధ్య నష్టాన్ని ఆపడానికి మరియు తిప్పికొట్టడానికి అన్ని వాటాదారులకు చర్యకు పిలుపు నిస్తుంది. కొంతమంది స్వార్థపూరీత ఆలోచనల మానవులవల్ల, వారియొక్క ధనాపేక్షవళ్ళ అవగాహన లేమితనంతో ప్రకృతిని, పర్యావరణాన్ని, పంచాభూతలను, సహవనరులను అక్రమవినియోగం చేస్తున్నారు. అవసరానికి మించి వినియోగం చేస్తున్నారు. పంచాభూతను, ప్రకృతిని, సహజవనరులను “ఒకేసారి డబ్బు రూపంలోకి మార్చడానికి” స్వార్థ మానవుడు ప్రయత్నంచేస్తున్నడు. దీనివల్ల మిగతా జీవుల (పశు, పక్షాదులు, సూక్ష్మజీవులు) మిగిలిన మానవుల జీవన విధానంలో అపశృతి, అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల జీవుల మనుగడలో అనేకమర్పులు జరిగి కాలక్రమేణ ఎన్నో జీవులు విలుప్తమైపోతున్నాయి. అంతేకాకుండా అవాసాలు నాశనమై ఏడారులుగా మారి జీవవైవిద్యం నాశనమౌతుంది. ఇప్పటికే అనేక భౌమ, జల, వాయు అవారణాలలోని అవాసాలు జీవ మనుగడకు అందుకుండపోయి అతివృష్టి, అనవృష్టి, కాలుష్యం, వాతావరణమార్పులు, మంచు కరుగుదల (ఐస్ మెల్టింగ్), భూమివేడెక్కుతూ (గ్లోబల్ వార్మింగ్), జీవవైవిధ్యంలో మార్పులు జరుగుతూ ఈ భూమిపైన జీవమే లేకుండా పోయే ప్రమాదము అతితోందరలో జరిగే అవకాశము ఉన్నది. అసలు జీవి మనుగడకు, జీవపరిణామనికే, ఆవరణం స్థాయిలో మార్పుతో ఆటంకం ఏర్పడుతోంది. ఇది మనం అత్యవసరంగా గమనించాల్సిన పరిస్థితి.
ఇంత ప్రమాదంలో ఉన్న భూగ్రహాన్ని రక్షించాల్సిన బాధ్యత అన్నజీవులనుమించిన తెలివికలిగిన్న మానవులమైన మనపై ఎంతో ఉన్నది. కానీ మనం తాత్కాలికమైన చేష్టలతో, స్వా అనుభూతులకొరకు జరుగుతున్న మార్పులను కప్పిపుచ్చుతూ, ఎప్పటికప్పుడు తాత్కాలికమైన విధానాలను సహజ సిద్దత్వానికి వ్యతిరేకంగా పోతూ ఆశాస్త్రియంగా సర్దుకుంటున్నాం. ఇది సరియైన పద్దతిలో జీవించడం కాదు. కేవలం బతకడానికి సర్దుబాటు చేసుకుంటున్నాం. ఇప్పుడున్న పర్యావరణమార్పులకు స్వార్ధపూరిత ఆలోచనలతో ప్రకృతి సహజత్వానికి వ్యతిరేకంగా పోతూ మానవుడే కారణమై వాటి యొక్క పర్యవసానానికి, ప్రభావానికి తామేకాకుండా తమచుట్టూ ఉన్న సజీవ, నిరజీవ ఘటకాలు తప్పుచేయకున్నా అందరూ గురివుతున్నాం. కాలుష్యకొరల్లో చిక్కుకుంటున్నాం.
ప్రకృతిపైన మానవుడు తమ కృత్రిమ వ్యతిరేఖ విధానాలతో ఇలాగే కొనసాగుతే పర్యావరణంలో అసమాతుల్యత ఏర్పడి అనేక దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదు. మనకళ్ళముందే ఎన్నో ఉదాహరణలు (కోవిడ్ మహమ్మారి, ఉత్తరఖాండ్ జలప్రళయం, విశాఖపట్నం సునామీ, దుబాయ్ జల దిగ్బంధం, ధ్రువ మంచుకరుగుదల USA మంచుతూఫాను మొ.) జరుగుతున్నా ఏమిచేయలేనిస్థితికి వచ్చాము, చోస్తూ ఊరుకుంటున్నాము. భూమి వేడెక్కడం, వరద భీభాత్సలు, కాలుష్యం, నీటికొరత, సహజవనరుల అసమానతలు, వన్యప్రాణుల వేట, అడవుల ఆక్రమణ, నరికివేత, క్షయం వాటియొక్క దోపిడి వల్ల తగ్గుదల ప్రభావాలు, వాటివలన ఏర్పడే సమస్యలు, కొట్లాటలు, అతివృష్టి అనవృష్టి ప్రభావం వల్ల జీవకోటి విలవిలాలాడి చివరకు విలుప్తమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈవిషదుష్ప్రభావాలనుండి మానవుడు అతీతుడు కాలేడు. అతని చేస్తలవల్ల తమేకాక తమచుట్టూ ఉన్న మిగతా జీవులు అమాయకంగా బలివుతున్నాయి.
ఈ భూమిమీద మానవుడే తెలివైనవాడు. తమ అతితెలివితేటలవల్లే తమచ్చుట్టువున్న పర్యావరణాన్ని అభివృద్ధి ముసుగులో సహజవనరుల ఎక్కువమోతుదులో వినియోగించడం, చెట్లనరికివేత, అడవుల నరికివేత, కాలుష్య కారకాలవినియోగం, పేష్టిసిడ్స్, ఫర్టిలైజర్స్ వాడకం, ప్లాస్టిక్ వాడకం ఇంకా అనేక రకాలుగా మొదలగునవి అవలంబిస్తూ నాశనంచేస్తున్నాడు. నీటిని వృధాచేస్తున్నాడు. కాబట్టే ఇప్పుడు కాపాడుకునే బాధ్యత వహించాలి. కానీ ఆబాధ్యతను ఎక్కువశాతం మంది నిర్వర్తించడంలేదు. ఇప్పటికైనా మానవులమైన మనం కనీసం మనమనుగడకోసమైనా పర్యావరణాన్ని రక్షించేందుకు నడుంబిగించాలి. మనచుట్టిజరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, మానవ స్వయంకృతాపరాధాల వల్ల ఏర్పడుతున్న, జీవమనుగడకు అపాయమేర్పడుతున్న ఆ సమయామిప్పుడు ఆసన్నమైనది కూడా. కాబట్టి ప్రతిఒక్కరు కారణాలను, విపరీతదోరనులను అర్ధంచేసుకోవాలి. ఆ వైపుగా అధ్యయనంచేస్తూ రక్షించే కోణంలో ద్రుష్టి కొనసాగించాలి. అప్పుడే ఈ విపరీతలకు కొంతవరకైనా అడ్డుకట్టవేసే అవకాశమున్నది.
భూమిపై జీవితం ప్రారంభమైనప్పటి నుండి, ఆరు పెద్ద సామూహిక విలుప్తాలు మరియు అనేక చిన్న సంఘటనలు జీవవైవిధ్యంలో పెద్ద మరియు ఆకస్మిక పడిపోవడానికి దారితీశాయి. ఫనెరోజోయిక్ ఏయాన్ (గత 540 మిలియన్ సంవత్సరాలు) కేంబ్రియన్ పేలుడు ద్వారా జీవవైవిధ్యంలో వేగవంతమైన వృద్ధిని గుర్తించింది. ఈ కాలంలో, మెజారిటీ బహుళ సెల్యులార్ ఫైలా మొదట కనిపించింది. తదుపరి 400 మిలియన్ సంవత్సరాలలో పునరావృత, భారీ జీవవైవిధ్య నష్టాలు ఉన్నాయి. ఆ సంఘటనలు సామూహిక విలుప్త సంఘటనలుగా వర్గీకరించబడ్డాయి. కార్బోనిఫెరస్‌లో, రెయిన్‌ఫారెస్ట్ పతనం వృక్ష మరియు జంతు జీవితాలను చాలా నష్టానికి దారితీసింది. పెర్మియన్-ట్రయాసిక్ విలుప్త సంఘటన, 251 మిలియన్ సంవత్సరాల క్రితం, సకశేరుకాల పునరుద్ధరణకు 30 మిలియన్ సంవత్సరాలు పట్టింది. అత్యంత ఇటీవలి, క్రెటేషియస్-పాలియోజీన్ విలుప్త సంఘటన 65 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించింది. ఈ కాలం ఇతరుల కంటే ఎక్కువ దృష్టిని ఆకర్షించింది ఎందుకంటే ఇది నాన్-ఏవియన్ డైనోసార్ల విలుప్తానికి దారితీసింది.
మానవ కార్యకలాపాలు కొనసాగుతున్న జీవవైవిధ్య నష్టం మరియు జన్యు వైవిధ్యం యొక్క నష్టానికి దారితీస్తున్నాయి . ఈ ప్రక్రియను తరచుగా హోలోసిన్ విలుప్తత లేదా ఆరవ సామూహిక విలుప్తంగా సూచిస్తారు . ఉదాహరణకు, 2050 నాటికి 30% వరకు అన్ని జాతులు అంతరించిపోతాయని 2007లో అంచనా వేయబడింది. వ్యవసాయం కోసం ఆవాసాలను నాశనం చేయడం నేడు జీవవైవిధ్యం తగ్గిపోవడానికి ఒక ముఖ్య కారణం. వాతావరణ మార్పు కూడా ఒక పాత్ర పోషిస్తుంది. బయోమ్‌లపై వాతావరణ మార్పుల ప్రభావాలలో దీనిని ఉదాహరణగా చూడవచ్చు .
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని పర్యావరణ ఉద్యమాలు, ఎన్నో సభలు, సమావేశాలు, కూటములు జరిగుతున్నప్పటికి, నియమానిభందనలు చేస్తున్నప్పటికి కొన్నిదేశాలు పూర్తిగా పర్యావరణ రక్షణ చెయ్యలేకపోతున్నాయి. కొన్నిదేశాలు పర్యావరణ విఘాతాలను ముందే పసిగట్టి ఈ అవగాహనలో మనకంటే మెరుగుగా ఉన్నాయి. నియమ నిబంధనలతో ముందుకెళ్లి సంతోష పర్యావరణంలో జీవిస్తున్నాయి. వారి వారి చట్టనియమాలను పాటిస్తున్నాయి. కొన్నిదేశలైతే వారి నేచరల్ రిసోర్సస్ ని ముందుచూపుతో దాసుకుంటున్నాయి. కావలిసిన సహజవనరుల యొక్క ముడి సరుకును ఇతరదేశాలనుండి కొనుక్కొని దిగుమతి చేసుకుంటున్నాయి.
మనదేశంలో భారత రాజ్యాంగంలోని 48 వ అధికరణ మనధర్మాన్ని మరియు 51A/(g) అధికరణ ప్రకారం తమచుట్టువుండే, సహజవనరులను, అడవుల్సను, అటవీజీవులను కాపాడి రక్షించుకునే బాధ్యత ప్రతీ భారత పౌరుడి యొక్క ప్రాథమిక విధి. ఈ విషయాన్నీ అందరు గమనించటంకాని, సరిఅయిన విధంగా నిర్వర్తించి అమలుపరిచటంలేదు. అదేవిధంగా మనకు సహజవనరులను (అడవులను, వన్యప్రాణులను, నీటిని, గాలిని, భూమిని (మట్టి )) అన్ని భూమ్యావారణాలను కాడుకునే విషయంలో అందరు చూసి చూడనట్లుగా, “ఎవరో చేస్తరులే” అన్నట్లుగా, “తమవంతుకొచ్చినపుడు చూసుకుందాంలే” అనే విధంగా తీసిపరేసుకుంటూ చిన్నచూపు చూస్తున్నారు, బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రాధమిక విధిని నిర్వర్తించకుండా ఆశ్రద్ద చూపుతున్నారు. ఇంకొందరైతే ప్రకృతి విఘాతకులను బలపరుస్తూ కొమ్ముకాస్తున్నారు. ఇది చాలా దారుణం, దౌర్భాగ్యం కూడ. మరికొందరు ప్రకృతి ప్రేమికులను, పర్యావరణ రక్షకులను, పర్యావరణవేత్తలను శత్రువులుగా భావించి వారిని వెంబడించి అనేక విధాలుగా వత్తిళ్లకు గురించేస్తున్నారు.
ఇది ఆలోచించాల్సిన సమయం. అప్రమతమాయ్యే తరుణం. మనల్ని మనం ప్రకృతి ప్రకోపం (స్వయం సమాతుల్యం) చెయ్యకముందే మార్చుకోవాలి. ఈ మార్పు చిన్నప్పటినుండే, తల్లితండ్రులు ప్రకృతిపట్ల వినయ విధేయతలతో బాధ్యతతో, ఏది చెయ్యాలో, ఏది చేయ్యకూడదో, ఏది చేస్తే మనకు, ప్రకృతికి నష్టముండదో చిన్నప్పటినుండే నేర్పిచగలగాలి. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలను ఎలావినియోగించుకోవాలో, మంచి ఏదో, చెడు ఏదో వారికి తెలియచేయ్యాలి. అలాచెయ్యాలంటే ముందుగా మనం పర్యావరణ అధ్యయనం నేర్చుకోవాలి. అదేవిధంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిన్నతరగతి విద్యార్థి దశనుండే పర్యావరణ విద్య అవగాహన విద్యార్థుల్లో కలిగించి ప్రాక్టీకల్గా వారికి భోధనచెయాలి. పర్యావరణవిద్యను ఒక ముఖ్య విషయంగా భోదించాలి. ఆ వైపుగా ప్రాధమిక, మధ్యమిక, ఉన్నత, ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ లలో పర్యావరణవిద్యను ముఖ్యమైన సబ్జక్టుగా భోదించేందుకు విధ్యావ్యవస్థలో సంబందించిన సంస్థలు, విద్యాలయాలు ప్రభుత్వాలకు సూచనలుచేసేలా మార్పులు తీసుకురావాలి. పర్యావరణంపైన పరిశోధనా, రచనలు, ఫిలాసోఫీ మొదలగు వాటిని ఉత్తేజపరిచేలా ప్రభుత్వాలు అనేక నూతన విధానపరమైన చర్యలను చేపట్టి అమలు పరచాలి.
పర్యావరణవిద్యను ముఖ్యంచేస్తూ అందరిలోమార్పు తీసుకురావాలనే ప్రతిన పూనుకోవాలి. అందుకోసం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, తత్వవేతలు,శాస్త్రవెత్తలు, పాలసీ మేకర్స్, డిసైషన్ మేకర్స్, కవులు-కవయిత్రిలు, రచయితా-
రచయిత్రిలు తాముచేస్తున్న కృషి, రచన బాధ్యతలలో కనీసం 35% పైగా పర్యావరణాన్ని రక్షించే కోణంలో తమ ఆలోచనలు, పరిశోధనలు, సాహిత్యం ఉండాలి. అప్పుడు మాత్రమే అందరికి పర్యావరణంపైన అవగాహన పెరిగి, ఎలామెదులుకుంటే పర్యావరణానికి హానికలుగదో తెలుసుకుంటారు. అవైపుగా అడుగులువేస్తారు. అప్పుడు మాత్రమే అవాసాలు నాశనం కాకుండా జీవవైవిద్యం రక్షించబడి, జీవ మనుగడకు తొడ్పాటు జరిగి పర్యావరణ అసమాతుల్యం సమాతుల్యం జరుగుతుంది. ఈరకంగా మనజీవిస్తూ సమస్థ జీవరాసికి జీవించడానికి యోగ్యమైన ఆవరణాలను, గొప్ప జీవవైవిధ్యాన్ని జీవనాన్ని ఇస్తూ రాభోవుతారాలకు మంచి ఆరోగ్య కరమైన వాతావరణంలో పర్యావరణాన్ని ఇవ్వగలం. మనపూర్వికులు మనకిచ్చిన స్వచ్ఛమైన పర్యావరన్నాణ్ణి భవిషత్తరాలకు ఇచ్చి ఆదర్శంగా సంతోషంగా ఉండగలం. పర్యావరణాన్ని అర్ధంచేసుకొని రక్షించే దిశగా నడుస్తూ, పాటిస్తూ, అందుకోసం సచర్యలు చేపడుతూ ముందుకెలితే పర్యావరణ సమస్యలు పరిష్కరించబడి జీవుల జీవనం అన్ని ఆవరణాలలో సుఖమయమౌతుంది. ప్రపంచం పచ్చగావుంటుంది.
జీవవైవిద్య రక్షన కొరకు, పర్యావరణ విద్య, సాహిత్యం మాత్రమే సమతుల్య పర్యావరణానికి రక్ష. జీవవైవిధ్యాన్ని రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కవులు – కవయిత్రులు, రచయితా – రచయిత్రిలు, కళాకారులూ, మేధావులు, పర్యావరణ, జీవ, సాంకేతిక శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు, పర్యావరణవేత్తలు మాత్రమే ఇప్పుడున్న జీవవైవిద్య రక్షణను, పర్యావరణ అసమతుల్యతలను మెరుగుపరచాలి. లేదంటే మానవ మనుగడ ప్రశ్నర్ధకమే.!
— రవి బాబు పిట్టల, పర్యావరణవేత్త, వైస్ ప్రెసిడెంట్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ (UFEP) & ఓరుగల్లు విల్డ్ లైఫ్ సొసైటీ (OWLS) ఉమ్మడి వరంగల్ జిల్లా, తెలంగాణ, ఇండియా.
