న్యూయార్క్‌ లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద రాజీవ్‌ గాంధీకి నివాళులర్పించిన పొన్నం ప్రభాకర్‌

ఈరోజు 21.05.2024న భారతరత్న ,భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని న్యూయార్క్‌ లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళ్లు అర్పించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్‌ .అనంతరం పొన్నం ప్రభాకర్‌ గారు మాట్లాడుతూ రాజీవ్‌ గాంధీ గారు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి ఆనాడు చేపట్టిన కార్యాచరణలో భాగంగానే ఈరోజు భారతదేశం సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించడానికి కారణమైంది . అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం తేవడానికి కూడా నేరుగా ఢల్లీి నుండి పల్లె వరకు నిధులను తీసుకురావడానికి కార్యాచరణను తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి , పల్లెలు బాగుండాలని ఆశించినటువంటి వ్యక్తి రాజీవ్‌ గాంధీ అని అటువంటి వ్యక్తికి కొనియాడి నివాళులు అర్పించడం మన బాధ్యత అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతిని కాపాడడానికి కాంగ్రెస్‌ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ వర్ధంతిని ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామని పిలుపివ్వడం జరిగింది .

Leave A Reply

Your email address will not be published.

Breaking