తూప్రాన్ మున్సిపాలిటీ లో రాక్షస పాలన అవినీతి అరాచకాల రాజ్యం పోయి ప్రజల రాజ్యం వచ్చింది. తుంకుంట నర్సారెడ్డి.
మున్సిపాలిటీ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకుల మాట.
తూప్రాన్ ప్రజలకు నిజమైన దీపావళి ఈ రోజే
తూప్రాన్, మార్చి, 6 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీలో బుధవారం నాడు రాక్షస పాలన పోయి ప్రజల పాలన వచ్చిందని సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి, తూప్రాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ మామిళ్ల జ్యోతి కృష్ణ అన్నారు. బుధవారం తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాసం నెగ్గి ఆయన స్థానం లో వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ను తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవినీతి, అరాచకం పెరిగిపోయి అహంకార పూరితంగా ఒంటెద్దు పోకడ తో ఎవరిని లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించినందున మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను సేకరించి అవిశ్వాసం పేట్టి తూప్రాన్ మున్సిపల్ పై కాంగ్రెస్ జండా ఎగరేసినట్లు పేర్కొన్నారు. అనంతరం తాత్కాలిక చైర్మన్ నందాల శ్రీనివాస్ మాట్లాడుతూ బొంది రవీందర్ గౌడ్ అహంకార పూరిత అవినీతి పై ఆ పార్టీ పెద్దలకు ఎన్ని సార్లు విన్నవించినా పలితం లేక పోవటంతో తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లో చేరి అవిశ్వాసం పేట్టి గద్దె దించామని తెలిపారు. అనంతరం అల్లాపుర్ కాంగ్రెస్ కౌన్సిలర్ జిన్నా భగవాన్ రెడ్డి మాట్లాడుతు బి.అర్.ఎస్ పార్టీ లో న్యాయం జరుగక ఆ పార్టీ కౌన్సిలర్ లు, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ లో చేరారని గజ్వేల్ టైగర్ తూంకుంట నర్సన్న ఆశీస్సులతో అవిశ్వాసం నెగ్గి నేడు తూప్రాన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చారని అన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకుడు 15వ వార్డు కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో సర్వస్వం కోల్పోయిన తన ను పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు అని అన్నారు. అలాంటి పార్టీలో అలాంటి మున్సిపల్ చైర్మన్ తో జత కట్టి నడువ లేక నా మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీ లో నర్సన్న అధ్వర్యంలో చేరి ఇక పై జీవితాంతం నర్సన్న కు కాంగ్రెస్ పార్టీకి విదేయుడిగా పని చేస్తా అని నొక్కి వాఖ్యానించారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాచారం గుట్ట ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నేడు తూంకుంట నర్సారెడ్డి చొరువ తో నేడు తూప్రాన్ లో కాంగ్రెస్ పార్టీ జండా ఎగరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పడాల్ పల్లి గౌతమ్ గౌడ్, ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, మనోహరబాద్ తాజా మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి , నాగులపల్లి సర్పంచ్ భగవాన్ రెడ్డి, నాగులపల్లి వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ లు మామిండ్ల జ్యోతీ కృష్ణ ముదిరాజు, జిన్నా భగవాన్ రెడ్డి, పల్లెర్ల జ్యోతీ రవీందర్ గుప్త, కొడిప్యాక నారాయణ గుప్తా, చెలిమెల ప్రియాంక, జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజీ, రవీందర్ రెడ్డి, భాణాపురం రాజు, రామునిగారి శ్రీశైలంగౌడ్, చైర్మన్ నందాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్, అప్సర్, ఉమర్, అనిల్, నందాల దుర్గా ప్రసాద్, నర్సింలు, కొండ రాజు, చెలిమెల రఘుపతి, జింక మల్లేశం, కృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దుర్గం నాగేష్, ధనరాజ్, నర్సింలు, అప్సర్ , కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
