భారతీయ భూవైజ్ఞానిక సర్వే శిక్షణా సంస్థ కార్యాలయం లో భూ విజ్ఞాన శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 14వ అంతర్జాతీయ కోర్సు ప్రారంభం
హైదరాబాద్, జనవరి 18, 2023
భారతీయ భూవైజ్ఞానిక సర్వే శిక్షణా సంస్థ (జి.యస్.ఐ.టి.ఐ.) బండ్లగూడ (నాగోల్), హైదరాబాద్ కార్యాలయం లో భూ విజ్ఞాన శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 14వ అంతర్జాతీయ కోర్సు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కోర్సును శ్రీ. సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V, ఆధ్వర్యంలో డాక్టర్ మాథ్యూ జోసెఫ్, డీడీజీ, డాక్టర్ బిభాస్ సేన్, డైరెక్టర్ & కోర్స్ కోఆర్డినేటర్, ఇతర డైరెక్టర్లు, ఫ్యాకల్టీ సభ్యులతో పాటు అంతర్జాతీయంగా ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా స్పాన్సర్ చేయబడిన ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ITEC) కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ 14వ కార్యక్రమం GSITI యొక్క సెంటర్ ఫర్ జియోఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్లో 18 జనవరి నుండి ఫిబ్రవరి 1, 2023 వరకు నిర్వహించబడుతుంది, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే వృత్తిపరమైన నైపుణ్యాన్ని సృష్టించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునే లక్ష్యంతో నిర్వహించబడుతుంది. 10 (పది) ITEC దేశాల నుండి (బంగ్లాదేశ్, కామెరూన్, ఇథియోపియా, ఇరాన్, ఈశ్వతిని రాజ్యం (పూర్వపు స్వాజిలాండ్), నైజర్, దక్షిణ సూడాన్, సుడాన్, తజికిస్తాన్ మరియు ఉగాండా) నుండి 15 మంది పాల్గొనేవారు ఈ కోర్సుకు హాజరవుతున్నారు.
స్వాగత ప్రసంగంలో శ్రీ సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-V మాట్లాడుతూ మానవ జీవితంలోని ప్రతి అంశంలో ఉపయోగపడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో అత్యాధునికతను నేర్చుకోవడానికి శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఉద్ఘాటించారు. శిక్షణలో పాల్గొనేవారి జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా భారతీయ సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొనేవారికి పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్స్ అందించారు మరియు స్వాగత కిట్తో సౌకర్యాన్ని కల్పించారు.
GIS-ఆధారిత ప్రాదేశిక డేటా ప్రాసెసింగ్, విశ్లేషణ, విజువలైజేషన్ మరియు నిర్ణయం తీసుకోవడంలో తాజా ట్రెండ్లతో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి కోర్సు రూపొందించబడింది. పాల్గొనేవారికి భౌగోళిక సమాచార వ్యవస్థ రంగంలో శిక్షణ ఇవ్వబడుతుంది, తద్వారా భూ శాస్త్రం & సహజ వనరుల నిర్వహణ, భూగోళశాస్త్రం, అటవీ శాస్త్రం, హైడ్రాలజీ, పర్యావరణ శాస్త్రం మొదలైన వారి సంబంధిత డొమైన్లలో ఈ పద్ధతులను సమర్ధవంతంగా వర్తింపజేయడం కోసం, భారతదేశం దాని సామాజిక-ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతిక విజయాల ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని భావిస్తుంది.